తూ.గో.లో అదే తీవ్రత: ఏపీలో 30 లక్షలు దాటిన కరోనా టెస్టులు

Siva Kodati |  
Published : Aug 19, 2020, 04:53 PM ISTUpdated : Aug 19, 2020, 04:54 PM IST
తూ.గో.లో అదే తీవ్రత: ఏపీలో 30 లక్షలు దాటిన కరోనా టెస్టులు

సారాంశం

ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 9,742 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. 

ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే వుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 9,742 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,16,003కి చేరింది.

గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 86 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,906కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 2,26,372 మంది కోలుకున్నారు.

గత 24 గంటల్లో 8,061 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క రోజులో 57,685 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. వీటితో కలిపి మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 30,19,296కి చేరింది. వైరస్ కారణంగా చిత్తూరు, నెల్లూరులలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత  అనంతపురం 8, గుంటూరు 7, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, తూర్పుగోదావరి 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, కడప 4, కృష్ణా 3, కర్నూలులో ఇద్దరు చొప్పున మరణించారు.

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 1,399కి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత అనంతపురం 1,123, చిత్తూరు 830, గుంటూరు 555, కడప 673, కృష్ణా 281, కర్నూలు 794, నెల్లూరు 755, ప్రకాశం 585, శ్రీకాకుళం 565, విశాఖపట్నం 835, విజయనగరం 428, పశ్చిమ గోదావరిలలో 919 మందికి వైరస్ సోకింది. 

 

 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం