అమరావతి ఎంతో విలువైంది: బాబుపై విజయసాయి సెటైర్లు

Published : Aug 06, 2020, 01:41 PM IST
అమరావతి ఎంతో విలువైంది: బాబుపై విజయసాయి సెటైర్లు

సారాంశం

చంద్రబాబు దృష్టిలో అమరావతి ఎంతో విలువైందని వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 20 మంది ఎమ్మెల్యేలా... లేక బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా అన్న ప్రశ్నకు ఎమ్మెల్యేలు పోతే పోయారు గానీ... లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.

అమరావతి: చంద్రబాబు దృష్టిలో అమరావతి ఎంతో విలువైందని వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 20 మంది ఎమ్మెల్యేలా... లేక బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా అన్న ప్రశ్నకు ఎమ్మెల్యేలు పోతే పోయారు గానీ... లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.

గురువారం నాడు ట్విట్టర్ వేదికగానే ఎంపీ విజయసాయిరెడ్డి బాబుపై విమర్శలు చేశారు. వైరస్ వ్యాప్తి లేనప్పుడు స్థానిక ఎన్నికలకు భయపడిన బాబు.. ఇప్పుడు వైరస్ వ్యాప్తి వున్న సమయంలో మళ్ళీ ఎన్నికలని ఛాలెంజ్ విసురుతున్నాడు. సవాల్ సిల్లీగా వున్నా.. ప్రజల భద్రతపై నారావారి నిబద్దత ఏంటో అర్ధమైపోయిందన్నారు. తన స్వార్ధం కోసం దేనికైనా తెగించే డెడ్లీ పొలిటికల్ వైరస్ నారానిప్పు' అంటూ చురకలంటించారు.

 

మూడు రాజధానులను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.ఈ విషయమై వైసీపీ కూడ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. రాజీనామాల అంశాన్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా బాబుపై విమర్శలు గుప్పించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu