2024 తర్వాత బాబుకీ గొటబాయ పరిస్ధితే.. అందుకే సింగపూర్‌లో హోటల్, ప్రైవేట్ జెట్ : విజయసాయిరెడ్డి సెటైర్లు

Siva Kodati |  
Published : Jul 14, 2022, 04:38 PM IST
2024 తర్వాత బాబుకీ గొటబాయ పరిస్ధితే.. అందుకే సింగపూర్‌లో హోటల్, ప్రైవేట్ జెట్ : విజయసాయిరెడ్డి సెటైర్లు

సారాంశం

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు చాలా ఏళ్ల క్రితమే సింగపూర్‌లో ఓ హోటల్ కొనుక్కున్నాడని.. ఒక ప్రైవేట్ జెట్ రెడీగా పెట్టుకున్నాడని ఆయన సెటైర్లు వేశారు. 

ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక, రాజకీయ సంక్షోభాన్ని (sri lanka economic crisis) ప్రస్తావిస్తూ టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) సెటైర్లు వేశారు వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy). గురువారం ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన .. ‘‘ ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసి - అక్కడ ఓ హోటల్ కొనుక్కున్నాడు. ఒక ప్రైవేట్ జెట్ రెడీగా పెట్టుకున్నాడు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయిలా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి. ఇద్దరిదీ చివరి మజిలీ సింగపూరే’’ నంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 

‘‘ ప్రజలు శని వదిలించుకున్నారు గానీ...ఈ వరదల టైములో మెంటల్ బాబ్జీ ఉంటే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తిష్టవేసి గంటగంటకు వాటర్ లెవల్ కొలిచేవాడు. వరదలను కంట్రోల్ చేసినట్టు ఎల్లోమీడియాలో బిల్డప్పులుండేవి. అధికారులను పని చేసుకోనివ్వకుండా మందలింపులు, ఫ్లడ్ మాన్యువల్ చదవాలని హెచ్చరించే వాడు’’ అంటూ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. 

‘‘ చంద్రం ఏం చేసినా పచ్చ కుల మీడియాకు అది చాణక్యమే! ఎందరి కాళ్లు పట్టుకున్నదీ, ఎంత లాబీయింగ్ చేసిందీ అందరికీ తెలుసు. పొర్లుదండాలు పెట్టి ప్రాధేయపడ్డాడు కాబట్టే ద్రౌపది ముర్ము గారు మర్యాద పాటించారు. కొన్నాళ్ల తర్వాత ఆమె పేరు ప్రతిపాదించింది నేనే అని కథలు మొదలెడతాడు.’’ అంటూ వైసీపీ ఎంపీ సెటైర్లు వేశారు. 

ALso Read:Sri Lanka crisis: మాల్దీవుల నుంచి సింగపూర్‌కు గోటబయ రాజపక్స.. అందుకేనా..?

కాగా.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స (gotabaya rajapaksa) దేశం విడిచి పారిపోవడంతో అక్కడ నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే శ్రీలంక నుంచి గోటబయ రాజపక్స మాల్దీవులు చేరుకన్న విషయ తెలియడంతో అక్కడ నివాసం ఉంటున్న శ్రీలంక వాసులు ఆందోళన నిర్వహించారు. మాల్దీవుల రాజధాని Maleలో శ్రీలంక జాతీయులు.. గోటబయకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దయచేసి క్రిమినల్స్‌కు రక్షణ కల్పించవద్దని కోరారు. 

ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉండటం సురక్షితం కాదని గోటబయ రాజపక్స భావించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. గోటబయ రాజపక్స, అతని భార్య సౌదియా ఎయిర్‌లైన్స్ SV788 విమానంలో మాలే నుంచి సింగపూర్‌కు బయలుదేరినట్టుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు వారు సింగపూర్ చేరుకుంటారని తెలుస్తోంది. గోటబయ రాజపక్స ప్రస్తుతానికి సింగపూర్‌లోనే ఉంటారని శ్రీలంక ప్రభుత్వ వర్గాల సమాచారం. 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్