మెషిన్‌గన్లతో ఫోజులు, యువతిని ట్రాప్ చేసి: హోంగార్డు లీలలు

Siva Kodati |  
Published : May 15, 2019, 11:28 AM IST
మెషిన్‌గన్లతో ఫోజులు, యువతిని ట్రాప్ చేసి: హోంగార్డు లీలలు

సారాంశం

ఓ హోంగార్డ్ తాను ఎస్ఐనంటూ మాయ మాటలతో యువతిని ట్రాప్ చేసి, మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

ఓ హోంగార్డ్ తాను ఎస్ఐనంటూ మాయ మాటలతో యువతిని ట్రాప్ చేసి, మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... నరసరావుపపేటలో హోంగార్డుగా పనిచేస్తున్న అనిల్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకున్నాడు.

తనకు పరిచయం వున్న గన్‌మెన్‌ల నుంచి తుపాకులు తీసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి.. వాటిని ఆ యువతికి పంపి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించాడు. అతను ఎస్ఐ అని నమ్మిన సదరు యువతి ఆమె తల్లి కూడా పెళ్లికి అంగీకరించారు.

ఈ క్రమంలో బ్యాంక్ లోన్ కింద రూ. 15 లక్షలు కట్టాల్సి ఉందని.. డబ్బు ఇవ్వాలని కోరారు. దీంతో వారు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి.. మరికొంత సొమ్మును తెలిసిన వారి నుంచి అప్పుగా తీసుకుని విడతలుగా రూ.12.50 లక్షలు అనిల్‌కు ఇచ్చారు.

కొంతకాలం తర్వాత తల్లీకూతుళ్లు పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో అనిల్ మీ అమ్మాయి మంచిది కాదంటూ ఆరోపించడంతో పాటు తన స్నేహితుడితో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న సదరు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కుటుంబసభ్యులు వెంటనే స్పందించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కనీసం తమ సొమ్ము అయినా ఇవ్వమని అడిగితే.. తాను ఇవ్వాల్సింది రూ. 6 లక్షలేనంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు.

గట్టిగా మాట్లాడితే.. తాను చావడమో, మిమ్మల్ని చంపడమో చేస్తానని బెదిరించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో తళ్లీకూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్ కారణంగా తన బిడ్డ జీవితం నాశనమైందని న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతోంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్