ఆధారాలను సీఐడీకి ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయండి:పురంధేశ్వరికి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్

By narsimha lodeFirst Published Nov 12, 2023, 10:11 AM IST
Highlights


ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కాం విషయంలో  వైఎస్ఆర్‌సీపీ, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. లిక్కర్ కేసులో  తన వద్ద ఉన్న సాక్ష్యాలను  సీఐడీకి ఇవ్వాలని వైఎస్ఆర్‌సీపీ  ఎంపీ  బీజేపీకి సూచించారు.

అమరావతి: లిక్కర్ స్కాంపై  తన వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందించాలని  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కోరారు. 

సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి  ఈ విషయమై  స్పందించారు.  చంద్రబాబు ఏ 3 గా ఉన్న కేసులో  ఆధారాలను  సీఐడీకి అందించాలని పురంధేశ్వరికి సూచించారు  విజయసాయిరెడ్డి.  

తప్పుడు సమాచారంతో  ప్రజల దృష్టిని మరల్చేందుకు  తమపై నిందలు వేయడం సరైంది కాదని  సోషల్ మీడియా వేదికగా  విజయసాయిరెడ్డి  అభిప్రాయపడ్డారు.  వాస్తవాలు బయటపడాలంటే  తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలని విజయసాయిరెడ్డి ఆమెను కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మద్యం అమ్మకాల్లో  అవినీతి జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు  పురంధేశ్వరి  ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో  అమిత్ షాకు  పురంధేశ్వరి లేఖ రాశారు.ఈ లేఖలో  మద్యం వ్యవహరంపై  వివరాలను పొందుపర్చారు. రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని కూడ ఆమె ఆరోపించారు. ప్రతి ఏటా మద్యం  ద్వారా  రూ. 25 వేల కోట్ల అవినీతి జరుగుతుందని  అమిత్ షా కు చేసిన ఫిర్యాదులో  పురంధేశ్వరి పేర్కొన్నారు.

ప్రతి ఏటా మద్యం విక్రయాల ద్వారా  రూ. 57,600 కోట్ల ఆదాయం వస్తుండగా  రాష్ట్ర ప్రభుత్వం  రూ. 32 వేల కోట్లు మాత్రం చూపుతుందని పురంధేశ్వరి ఆరోపించారు. 

 

చంద్రబాబు గారు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి గారు దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలి. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా…

— Vijayasai Reddy V (@VSReddy_MP)

ఇదిలా ఉంటే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు  ఈ ఏడాది అక్టోబర్  30న కేసు నమోదు చేశారు. మద్యం తయారీ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని  ఈ కేసు నమోదైంది.  కొన్ని కంపెనీలకు  ప్రయోజనాలు చేర్చే విధంగా  వ్యవహరించారని  ఏపీ బ్రేవరేజేస్ కార్పోరేషన్ అధికారులు ఇచ్చిన  ఫిర్యాదు మేరకు  సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో  చంద్రబాబు పేరును  ఏ3గా చేర్చారు.
 

click me!