Diwali 2023 : చెడుపై మంచి విజయమే దీపావళి అంటూ... ఆసక్తికరంగా సీఎం జగన్ శుభాకాంక్షలు

Published : Nov 12, 2023, 09:16 AM ISTUpdated : Nov 12, 2023, 09:27 AM IST
Diwali 2023 : చెడుపై మంచి విజయమే దీపావళి అంటూ... ఆసక్తికరంగా సీఎం జగన్ శుభాకాంక్షలు

సారాంశం

చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి  సాాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగను తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఏపీ సీఎం జగన్ కోరుకున్నారు. 

అమరావతి : తెలుగు ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఈ దీపావళి పండగను ఆనందంగా జరుపుకోవాని కోరుకుంటున్నానని అన్నారు. ఈ దీపావళి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 

'దీపావళి అంటేనే కాంతి-వెలుగు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని... సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని... ప్రతి ఇంటా ఆనందకాంతులు విరాజిల్లాలి' అని సీఎం వైఎస్ జగన్ కోరుకున్నారు.  

ఇక టపాసులు కాల్చేపుడు చిన్నారులతో పాటు పెద్దలు కూడా జాగ్రత్తగా వుండాలని సీఎం జగన్ సూచించారు. ముఖ్యంగా వృద్దులు, రోగులకు ఇబ్బంది కలిగించకుండా టపాసులు కాలుస్తూ పండగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి జగన్. 

Read More  Diwali 2023: ప్ర‌జ‌ల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఇక ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  దీపాల పండగ దీపావళిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ పండగపూట వెలిగించే పవిత్ర దీపాలు ప్రజల జీవితాల్లో శాంతిని నింపి ఆనందాన్ని కలిగించాలని గవర్నర్ నజీర్ కోరుకున్నారు. 

 

ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రజలు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 'జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళి సందర్భంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు . దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు. దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబం అంతా కలిసి సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు విరజిమ్మాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని అచ్చెన్నాయుడు తెలిపారు. 

'నరకాసురుని వధించి నరులందరి జీవితాలలో వెలుగును నింపిన మాతా సత్యభామ శౌర్యానికి..చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. కారుచీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్టే.. దీపావళి పండుగ మీ కష్టాలను తరిమేయాలి,కష్టాల చీకట్లు తొలగిపోవాలి.. సంతోషాల వెలుగులు ప్రసరించాలి. ప్రకృతికి ఎక్కువ హాని చెయ్యకుండా పండుగ చేసుకుందాం. ఈ దీపావళికి వెలిగించే దీపాలు మీ జీవితాల్లో  వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు  ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు' అన్నారు నందమూరి బాలకృష్ణ. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?