విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన 22 కి.మీ దూరం పాదయాత్ర నిర్వహించాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన 22 కి.మీ దూరం పాదయాత్ర నిర్వహించాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.
జీవీఎంసీ నుండి కూర్మన్నపాలెం గేటు వరకు పాదయాత్ర నిర్వహించాలని విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షకు కూడ విజయసాయిరెడ్డి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా పాదయాత్ర చేయాలని విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.
undefined
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది, ఈ ప్రతిపాదనను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు ఆందోలన బాట పట్టాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఏపీకి చెందిన బీజేపీ నేతలు కూడ కోరుతున్నారు. ఢిల్లీకి ఏపీకి చెందిన బీజేపీ ప్రతినిధి బృందం వెళ్లింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని బీజేపీ నేతలు కోరతున్నారు.