లండన్‌లో జగన్‌ ల్యాండింగ్‌ ‌: ఆయన మెంటల్ కండీషన్ బాలేదు.. అయ్యన్నకు విజయసాయిరెడ్డి కౌంటర్

Siva Kodati |  
Published : May 24, 2022, 02:24 PM IST
లండన్‌లో జగన్‌ ల్యాండింగ్‌ ‌: ఆయన మెంటల్ కండీషన్ బాలేదు.. అయ్యన్నకు విజయసాయిరెడ్డి కౌంటర్

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం లండన్‌లో దిగడంపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు.   

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై (jagan davos tour) టీడీపీ నేత (tdp) అయ్యన్నపాత్రుడు (ayyanna patrudu) చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy).  ''అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది. మెదడుకి, నాలుకకు మధ్య ‘హుందాతనం’ అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్ సిద్ధం చేయక తప్పేలా లేదు. ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల బాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే తయారైంది'' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

అంతేకాదు... ''దావోస్ వెళ్లి బాబు ఏం చేశాడో, ఏం తీసుకొచ్చాడో ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. పాత వీడియోలు చూస్తే రాష్ట్రం పరువు తీసొచ్చాడని మాత్రం అర్థమవుతోంది. తన పాలనలో నేరాలే జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 2016-19 మధ్య రాష్ట్రంలో 1,44,703 నేరాలు నమోదైనట్టు ఎన్‌సీఆర్బీ వెల్లడించింది'' అని ఆయ‌న దుయ్యబట్టారు.

కాగా... ఏపీ సీఎం వైఎస్  జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం లండన్‌లో ల్యాండ్ అవ్వడంపై వివాదం కొనసాగుతూనే వుంది. దీనిపై శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) క్లారిటీ ఇచ్చినా ప్రతిపక్ష టీడీపీ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా బుగ్గన ఇచ్చిన వివరణపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన‌వ‌న్నీ అస‌త్యాలేన‌ని ఆయన ఎద్దేవా చేశారు . ఈ ఈమేరకు ఆదివారం అయ్యన్న ట్వీట్ చేశారు. 

''జగన్ రెడ్డి లండన్ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడు. జగన్ రెడ్డికి ఫ్లైట్ పర్మిషన్ లేక లండన్ వెళ్లాడు అనేది పచ్చి అబద్ధం. జ్యూరిక్‌ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం మే 17నే, లండన్ లోని లూటన్ ఎయిర్ పోర్ట్ నుంచి, జ్యూరిక్‌ దగ్గరలోనే బాసిల్ కు, జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఈ 190 ఫ్లైట్ వస్తుందని సమాచారం ఇచ్చారు. ఇది ముందే ప్రీ ప్లాన్డ్ టూర్.. మే 17నే సమాచారం ఉంది. ఇప్పుడు ఏమి చెబుతావ్ బుగ్గన? చెప్పు ఏ బుర్ర కథ చెబుతావో'' అని అయ్య‌న్న పాత్రుడు నిల‌దీశారు.
 

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu