బీజేపీ అలా భావిస్తే ఏపీలో పొత్తులుండవు: మాజీ ఎంపీ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published May 24, 2022, 1:17 PM IST
Highlights

దేశంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకొంటున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

విజయవాడ:  దేశంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.మంగళవారం నాడు Vundavalli Arun kumar  విజయవాడలో  మీడియాతో మాట్లాడారు.మనం ఎటుపోతున్నామోననే ఆందోళన కలుగుతుందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ విభజన జరిగిన సమయంలో కూడా ఇలా లేదని ఆయన చెప్పారు.BJP ని తప్పు బట్టలేమన్నారు. అది ఆ పార్టీ విధానమని ఆయన చెప్పారు. సావర్కర్ పుస్తకం ఆర్ఎస్ఎస్ వాళ్లకు రాజ్యాంగమన్నారు.వాళ్ల విధానంలో మార్పు ఎప్పుడూ రాలేదని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.,అన్ని రంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

also read:ఇలాంటి గ్యాంబ్లింగ్ ఎవరూ చేయలేదు.. అసలు క్విడ్‌ ప్రోకో ఇదే : జగన్‌పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

మతాన్ని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి వివాదం చేయవద్దని ఆయన హితవు పలికారు. అసలు మనం ఎటుపోతున్నామో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చదువుకుంటున్నవాళ్లు కూడా సంకుచితంగా ఆలోచిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇతర దేశాల ప్రజలు కూడా మన దేశ సంప్రదాయాలను పాటిస్తారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా బీజేపీలో చేరడం ఆశ్చర్యంగా ఉందన్నారు.కాంగ్రెస్ ది సెక్యులరిజం, కమ్యూనిష్టులది సోషలిజం, బీజేపీది హిందూయిజమని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

చంద్రబాబు,జగన్ ప్రభుత్వాలకు పెద్ద తేడా లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.ప్రత్యేక హోదా, పోలవరం 9, 10 షెడ్యూల్ ప్రకారం హైద్రాబాద్ నుండి వచ్చే ఆస్తుల విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. న్యాయ బద్దంగా రావాల్సిన వాటా గురించి అడిగేందుకు ఎందుకు భయపడుతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టుపై విపక్షంలో ఉన్న సమయంలో జగన్ ప్రశ్నించాడని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తామన్నారన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును ఎందుకు అప్పగించలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

ఏపీలో పొత్తులపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh  రాష్ట్రంలో YCP  కొనసాగాలని బీజేపీ భావిస్తే  పొత్తులుండవని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బీజేపీ, Jana sena లు విడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు.ప్రస్తుతానికి  YS Jagan బీజేపీతో సఖ్యతతోనే ఉన్నారని ఆయన చెప్పారు.

 ఏపీకి  జగన్ పాలనలో ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఓట్లేసిన వాళ్లకు అన్నీ చేసేద్దామన్నారు. ఓట్లేయని వాళ్లను పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా జగన్ పాలన ఉందని ఆయన విమర్శించారు. ప్రజలను వైసీపీ మోసం చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో YCP , టీడీపీ, జనసేనలు బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నాయని ఆయన విమర్శించారు. 

 వీళ్లలో వీళ్లు తిట్టుకుంటారే కానీ బీజేపీని మాత్రం ఒక్కమాట కూడా అనరని ఉండవల్లి పేర్కొన్నారు. సీఎంలు మారినా ఏపీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయన్నారు. పోలవరం కింద రూ.30 వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకే పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపడం లేదన్నారు. కనీసం ప్రాజెక్ట్‌ పూర్తి చేయకపోయినా 41 మీటర్లు ఆనకట్టగా అయినా అభివృద్ధి చేయాలని ఉండవల్లి సూచించారు.

click me!