ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని సీఎం ఉన్నా ఒకటే... లేకున్నా ఒకటే: ఎమ్మెల్సీ అశోక్ బాబు

Arun Kumar P   | Asianet News
Published : May 24, 2022, 01:53 PM ISTUpdated : May 24, 2022, 02:02 PM IST
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేని సీఎం ఉన్నా ఒకటే... లేకున్నా ఒకటే: ఎమ్మెల్సీ అశోక్ బాబు

సారాంశం

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆందోళన వ్యక్తం చేసారు. కొందరికయితే రెండు మూడు నెలలేగా జీతాలే అందలేదని ఆరోపించారు. 

అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సిపిఎస్ పై సంప్రదింపుల (కన్సల్టేటివ్) సమావేశం జరగుతున్న నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగస్థుల సమస్యలను పరిష్కరించలేని ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే... లేకున్నా ఒకటే అంటే విమర్శించాడు. గతంలో సిపిఎస్ రద్దు చేస్తానని స్వయంగా జగనే హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక వెనక్కితగ్గారని అశోక్ బాబు గుర్తుచేసారు.  

''రాష్ట్రంలో కాంట్రాక్టు,  ఔట్ సోర్సింగ్, ఆరోగ్యశాఖ,  ఆశా వర్కర్లు, అంగన్వాడీలు జీతాలు లేక అలమటిస్తున్నారు. అగన్వాడీలకు గత మూడు నెలలుగా జీతాలు లేవు. మున్సిపల్ వర్కర్లకి హెల్త్ అలవెన్స్ అని ఇచ్చి మళ్ళీ  రికవరి పెట్టడం అన్యాయం.  ఆర్టీసీలో కారుణ్య నియామకాల్లో ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదు. విద్యుత్ కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి వుంది. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లే సూచనలున్నాయి. ఇదే జరిగితే రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉండొచ్చు'' అని అశోక్ బాబు ఆందోళన వ్యక్తం చేసారు. 

''రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఆ శాఖ మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నెలనెలా జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వముంది. ఉద్యోగస్థుల బిల్లులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? ఎంతమందికి చెల్లించారు? రిటైర్ మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రజలకు తెలపాలి'' అంటూ టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేసారు.  

ఇదిలావుంటే సిపిఎస్ పై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు (కన్సల్టేటివ్) సమావేశం  సచివాలయంలో ప్రారంభమయ్యింది. ఈసమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి( జిఎడి సర్వీసెస్) హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే ఉద్యోగ సంఘాల తరపున ఏపి ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ప్రసాద్ తో పాటు ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

  సీపీఎస్ రద్దు చేసిన జీపీఎస్ ను తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం  తెలిసిందే. అయితే జీపీఎస్ ను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. దీంతో ఈ సిపిఎస్ రద్దు, జిపిఎస్ అమలుపై చర్చించేందుకు మంత్రులతో కూడిన  సబ్ కమిటీ ఉద్యోగసంఘాలతో సమావేశమయ్యింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలో వుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వున్న సమయంలో విపక్షనేత వైఎస్ జగన్ సీపీఎస్ ను రద్దు చేస్తామని ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకుహామీ ఇచ్చారు. అయితే ఈ హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.  
 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu