నా పేరు చెప్పి భూదందా: ఎంతటి వారైనా వదిలేది లేదు.. విజయసాయి వార్నింగ్

By Siva KodatiFirst Published Aug 15, 2020, 2:41 PM IST
Highlights

విశాఖలో తన పేరును ఉపయోగించుకుని కొందరు భూదందాలు చేస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇలా అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.

విశాఖలో తన పేరును ఉపయోగించుకుని కొందరు భూదందాలు చేస్తున్న మాట వాస్తవమేనని అంగీకరించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇలా అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సైతం ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని విజయసాయి తెలిపారు. తన పేరును ఉపయోగించి భూదందాలు చేస్తున్న వారి విషయం తన దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో.. ఈ చర్యకు పాల్పడిన వారు ఎంతటి వ్యక్తయినా సరే కేసులు పెట్టి, అరెస్ట్ చేయిస్తామని ఆయన హెచ్చరించారు.

కాగా విజయసాయిరెడ్డి పేరు చెప్పి ఆ పార్టీకి చెందిన ఒక నేత విశాఖలో భూదందాకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత పదవి లేకపోయినా విజయసాయిరెడ్డి పేరును వాడుకుంటూ భూదందాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

రాజమండ్రికి చెందిన కల్యాణరావు అనే వ్యక్తికి విశాఖలో వంద ఎకరాల వరకు భూములు ఉన్నాయి. వంశపారంపర్యంగా ఆ భూములు ఆయనకు వచ్చాయి. అయితే, ఆయన చనిపోయినట్టు డాక్యుమెంట్లు సృష్టించి... ఆ భూములను దక్కించుకోవడానికి కొందరు యత్నించారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న కల్యాణరావు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్డీవో కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఆ భూములు దేవాదాయశాఖ స్వాధీనంలో ఉన్నాయి.

ఆ భూములకు తానే హక్కుదారుడినని, వాటిని విక్రయించాలని రాజమండ్రికి చెందిన కొల్లి నిర్మల కుమారి అనే మహిళకు కల్యాణరావు చెప్పారు. నిర్మల కుమారి 2019 వరకు వైసీపీలో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు.

ఆమె ఈ సమస్యను ప్రసాద్ రెడ్డికి వివరించారు. అయితే ఈ భూములను విజయసాయిరెడ్డి కొనుగోలు చేయాలనుకుంటున్నారంటూ ప్రసాద్ రెడ్డి బెదిరిస్తుండటంతో... బాధితులు నేరుగా విజయసాయిరెడ్డినే కలిశారు.

click me!