న్యాయవ్యవస్థపై నిఘా అంటూ వార్తలు: జగన్ సర్కార్ సీరియస్.. మీడియాకు వార్నింగ్

By Siva KodatiFirst Published Aug 15, 2020, 2:26 PM IST
Highlights

న్యాయవ్యవస్థల మీద నిఘా వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ తరహా ప్రచురణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

న్యాయవ్యవస్థల మీద నిఘా వార్తలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ తరహా ప్రచురణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని ఏపీ సర్కార్ ఆరోపించింది.

కొన్ని రాజకీయ శక్తులు కావాలనే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నది ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. కాగా ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న కొందరు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్నట్లుగా శుక్రవారం కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై జగన్ ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 

click me!