ఇది నీ నిజస్వరూపం.. మాన్సాస్ టార్గెట్‌గా మరోసారి అశోక్ గజపతిపై విజయసాయి ట్వీట్లు

By Siva KodatiFirst Published Jul 31, 2021, 2:46 PM IST
Highlights

సింహాచలం దేవస్థానంలో ఆభరణాలు, మాన్సాస్ వ్యవహారం నేపథ్యంలో మరోసారి అశోక్ గజపతి రాజుపై విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.  2009 నుంచి సింహాచలం దేవస్థానంలో నగల అప్రైజ్ జరగలేదని.. మాన్సాస్ లో 2004 నుంచి ఆడిటింగే లేదని ఆయన దుయ్యబట్టారు.
 

మాన్సాస్ ట్రస్ట్ చైర్మ‌న్, కేంద్ర‌ మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి మ‌రోసారి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 'ప్రజాస్వామ్యం, పారదర్శకతంటూ ఆదర్శాలు వల్లించడం వరకేనా పూసపాటి అశోక్. 2009 నుంచి సింహాచలం దేవస్థానంలో నగల అప్రైజ్ జరగలేదు. మాన్సాస్ లో 2004 నుంచి ఆడిటింగే లేదు. ఇదీ నీ పారదర్శకత. నీ నిజస్వరూపం. నీతులు ఎదుటివారికి చెప్పడానికే ఉన్నాయన్నట్లు ప్రవర్తిస్తున్నావ్' అని విజ‌య‌సాయిరెడ్డి  ట్వీట్ చేశారు.

కాగా, గ‌త ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోళ్లలో వ్య‌వ‌హ‌రించిన తీరును  ప్ర‌స్తుత స‌ర్కారు అనుస‌రిస్తోన్న తీరుపైనా విజ‌య‌సాయిరెడ్డి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. 'పారదర్శకతతో తక్కువ ధరకు ఓపెన్ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేసి రాష్ట్రం 2,342 కోట్ల రూపాయ‌ల ఆదా చేసింది. కమిషన్లు మింగి చంద్రబాబు చేసుకున్న పీపీఏలను రద్దు చేయడంతో ఆ కంపెనీలు దిగిరాక తప్పలేదు. యూనిట్ రూ.3 కంటే తక్కువకే ఇస్తున్నాయి. జగన్ గారి సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది' అని విజ‌య‌సాయిరెడ్డి చెప్పుకొచ్చారు


 

ప్రజాస్వామ్యం, పారదర్శకతంటూ ఆదర్శాలు వల్లించడం వరకేనా పూసపాటి అశోక్. 2009 నుంచి సింహాచలం దేవస్థానంలో నగల అప్రైజ్ జరగలేదు. మాన్సాస్ లో 2004నుంచి ఆడిటింగే లేదు - ఇదీ నీ పారదర్శకత. నీ నిజస్వరూపం. నీతులు ఎదుటివారికి చెప్పడానికే ఉన్నాయన్నట్లు ప్రవర్తిస్తున్నావ్.

— Vijayasai Reddy V (@VSReddy_MP)
click me!