మీసం మెలేసి... రెచ్చగొట్టే వ్యాఖ్యలు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

By telugu teamFirst Published Jul 31, 2021, 12:32 PM IST
Highlights

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు మీసం మెలేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ రెండో చైర్ పర్సన్ పదవిని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ ఈ ఎన్నికకు గైర్హాజరైంది. దాంతో నాలుగో వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రహీంకు ఆ పదవి దక్కింది.

అధికార పార్టీ గైర్హాజరు కావడం విచిత్రంగా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఆయన సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే జీరో అయ్యారని వ్యాఖ్యానించారు.  నడిరోడ్డుపైకి వస్తానని, తనపై దమ్ముంటే చార్జిషీట్ వేయించాలని ఆయన పెద్దారెడ్డిని సవాల్ చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చారని ఆయన అన్నరు 

పెద్దారెడ్డి మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, పెద్దారెడ్డి తన మొహాన్ని ఓసారి అద్దంలో చూసుకోవాలని, జగన్ ను చూసి ఓట్లేశారని ఆయన అన్నారు. దమ్ముంటే సెంటర్ లోకి రా చూసుకుందామని జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. 

click me!