దేవినేని పై కేసు.. చంద్రబాబు సీరియస్..!

Published : Jul 31, 2021, 12:53 PM ISTUpdated : Jul 31, 2021, 01:08 PM IST
దేవినేని పై కేసు.. చంద్రబాబు సీరియస్..!

సారాంశం

కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కొట్టేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరుగుతోందని చెప్పినా పట్టించుకోలేదన్నారు.  

మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  ఆయనపై వైసీపీ నేతలే దాడి చేసి.. మళ్లీ రివర్స్ లో కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.  శనివారం చంద్రబాబు.. విజయవాడలోని గొల్లపూడి లో ఉన్న దేవినేని కుటుంబసభ్యులను కలిశారు. వారిని పరామర్శించిన చంద్రబాబు.. తర్వాత మీడియాతో మాట్లాడారు.

జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలు గమనించారని.. ఎస్సీలపై దాడి చేసినట్లు దేవినేని పై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కొట్టేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరుగుతోందని చెప్పినా పట్టించుకోలేదన్నారు.

దేవినేని ఉమపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దాడి చేసి రివర్స్ కేసు పెట్టడం నీచమైన పని అని అన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకే పరిశీలనకు వెళ్లారన్నారు. పోలీసులు మరీ ఇంత నీచంగా ఎప్పుడూ పనిచేయలేదన్నారు. అక్రమ మైనింగ్ జరగకపోతే నిజ నిర్థారన కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

పోలీసులు దారి మళ్లించి దాడి జరిగే ప్రాంతం వైపు దేవినేని ఉమా వెళ్లేలా చేశారని ఆరోపించారు. ఈ దాడులకు టీడీపీ  భయపడదన్నారు. టీడీపీతో పెట్టుకున్నవారు కాల గర్భంలో కలిసిపోయారని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu