అన్నీ డ్రామాలే.... 13 జిల్లాల్లో అభివృద్ధంతా గ్రాఫిక్సే: షేమ్ బాబూ అంటూ విజయసాయి ట్వీట్

Siva Kodati |  
Published : Aug 11, 2020, 05:10 PM IST
అన్నీ డ్రామాలే.... 13 జిల్లాల్లో అభివృద్ధంతా గ్రాఫిక్సే: షేమ్ బాబూ అంటూ విజయసాయి ట్వీట్

సారాంశం

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డాడు

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మంగళవారం వరుస ట్వీట్లు చేసిన  ఆయన 'సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్లపాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్‌ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్' అంటూ ఎద్దేవా చేశారు.  

 

 

మరో ట్వీట్‌లో.. 'బట్టలు విడిచిన మూర్ఖపు రాజు.. తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించటం లేదనుకున్నాడట! 175కు 151 ఓడిన, కొడుకును కూడా ఓడగొట్టుకున్న చంద్రబాబు... 13 జిల్లాల్ని తాను అభివృద్ధి చేశానని ఏవేవో గ్రాఫిక్స్ ఇప్పుడు చూపిస్తున్నాడట!! షేమ్.. షేమ్.. బాబూ...!' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

నాకెప్పుడూ ఇలాంటి ఆలోచన రాలేదు జగన్ కి వచ్చింది అందుకే.. Chandrababu on Jagan | Asianet News Telugu
రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu