రేపు ఢిల్లీకి వైసీపీ ఎంపీలు: రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ ఇచ్చే ఛాన్స్

By narsimha lodeFirst Published Jul 2, 2020, 3:07 PM IST
Highlights

వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత  వేటు వేయాలని స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. 

అమరావతి: వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత  వేటు వేయాలని స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. 


పార్టీ నాయకత్వంపై, పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై నర్సాపురం ఎంపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గత నెల 22వ తేదీన షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై రఘురామకృష్ణంరాజు సాంకేతిక అంశాలను లేవనెత్తారు.గత నెల 29వ తేదీన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు ఆయన ఆరు పేజీల లేఖ రాశాడు. 

షోకాజ్ నోటీసుకు స్పందించిన తీరుపై రఘురామకృష్ణంరాజుపై వైసీపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. రఘురామకృష్ణం రాజు తీరుపై మచిలీపట్నం ఎంపీ బాలశౌరి  ఇటీవల వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రఘురామకృష్ణంరాజు అంశంపై చర్చించినట్టుగా సమాచారం.

also read:హెచ్చరికలు, షోకాజ్ నోటీసులు ఓవర్: రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు దిశగా వైసీపీ పావులు..?

ఈ నెల 3వ తేదీన వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ ఆదేశాలను రఘురామకృష్ణంరాజు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు స్పీకర్ దృష్టికి తీసుకు రానున్నారు.

పార్టీకి దూరం కావాలనే ఉద్దేశ్యంతోనే రఘురామకృష్ణంరాజు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను రఘురామకృష్ణంరాజు కొట్టిపారేస్తున్నారు.

రఘురామకృష్ణంరాజు వ్యవహరంపై న్యాయనిపుణులతో కూడ వైసీపీ ఎంపీలు చర్చించనున్నారు. 

click me!