ఇక ప్రభుత్వాలు ఎందుకు?:కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

Published : Jul 02, 2020, 02:41 PM ISTUpdated : Jul 02, 2020, 03:07 PM IST
ఇక  ప్రభుత్వాలు ఎందుకు?:కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

సారాంశం

న్యాయస్థానాలే ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకొంటున్నాయని ఆయన తెలిపారు.


తిరుపతి: న్యాయస్థానాలే ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకొంటున్నాయని ఆయన తెలిపారు.

గురువారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుకొన్నాయన్నారు.కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకొంటే ఈ మాత్రానికి ప్రభుత్వమెందుకు ఆయన ప్రశ్నించారు. ప్రజా కోర్టులో ఎన్నికలు నిర్వహించుకోవడం ఎందుకని ఆయన సందేహం వ్యక్తం చేశారు. 

also read:ఉద్యోగులకు జీతాలు నిలిచిపోవడానికి టీడీపీయే కారణం: తమ్మినేని సీతారాం

ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు ఎందుకు అని ఆయన అడిగారు. 50 ఏళ్లుగా చూడని వింత పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ద్రవ్య బిల్లును ఆపి ఉద్యోగుల జీతాలను అడ్డుకొన్నారని ఆయన మండిపడ్డారు.  రాజ్యాంగ నిబంధనలకు లోబడే ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కోర్టులను ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.ఇవాళ ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. నాలుగు రోజుల పాటు తిరుపతిలో ఆయన పర్యటించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu