చంద్రబాబు అరెస్ట్ .. ‘‘మోత మోగిద్దాం’’ అన్న నారా లోకేష్, రఘురామకృష్ణంరాజు మద్ధతు

By Siva KodatiFirst Published Sep 30, 2023, 3:00 PM IST
Highlights

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్ధతుగా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మద్ధతు తెలిపారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్ధతుగా ఏపీతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మద్ధతు తెలిపారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు మద్ధతు తెలిపాలని కోరారు. 

ఒక్క మద్యం షాపు కూడా తగ్గించకుండా రాష్ట్రంలో మద్యం షాపులు పెట్టారని.. లైసెన్స్‌ను కూడా మరో ఏడాది పొడిగించారని రఘురామ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో కొత్త స్కీమ్ తీసుకొచ్చారని.. కొన్ని పోస్టులు పెట్టిన వారికి వైసీపీ సోషల్ మీడియా రివార్డ్ ప్రకటించిందని ఆయన ఆరోపించారు. చిల్లరకు కక్కుర్తి పడొద్దని రఘురామ హితవు పలికారు. జగనన్న పాల ప్యాకెట్లు ఉబ్బి పేలిపోతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరహార దీక్ష..: అచ్చెన్నాయుడు

ఇకపోతే.. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని చాలా మంది బాధపడుతున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేక 97 మంది చనిపోయినట్టుగా తమకు సమాచారం ఉందని చెప్పారు. వారి కుటుంబాలకు తాము సంతాపం తెలుపుతున్నట్టుగా చెప్పారు. త్వరలోనే చనిపోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతామని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున నిరహార దీక్ష చేస్తారని తెలిపారు. 

నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఫంక్షన్ హాల్ వద్ద ఈరోజు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాలు, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై  ఈ సమావేశంలో చర్చించారు. 
 

click me!