తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Published : Sep 30, 2023, 12:07 PM ISTUpdated : Sep 30, 2023, 12:35 PM IST
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

సారాంశం

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు(వీకెండ్, గాంధీ జయంతి) నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు.

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు(వీకెండ్, గాంధీ జయంతి) నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయి క్యూలైన్లు వెలుపలకు వచ్చాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. మరోవైపు అలిపిరి చెక్‌పాయింట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక, వసతి సౌకర్యాల విషయంలో కూడా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టీటీడీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

ఇదిలాఉంటే, శుక్రవారం రోజున తిరుమల శ్రీవారిని 66,233 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,486 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.71 కోట్లుగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు