ఈ నెల 20నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
అమరావతి: ఈఈ నెల 20నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. 2021-2022 బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది.బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు పూర్తై ఆరు మాసాలు అవుతోంది. దీంతో జూన్ 3వ తేదీ లోపుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మూడు మాసాల పాటు ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
వాస్తవానికి మార్చి నెలాఖరుకు బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలపాలి. అయితే ఈ ఏడాది మార్చి మాసంలో అసెంబ్లీ సమావేశాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించలేదు. తిరుపతి ఉప ఎన్నికలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో మూడు నెలల బడ్జెట్ కు ఆర్డినెన్స్ ను ఈ ఏడాది మార్చి మాసంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ ఏడాది మార్చి 28న ఆమోదముద్ర వేశారు. సుమారు రూ 90 వేల కోట్ల బడ్జెట్ కు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఏపీ సర్కార్. దీంతో ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ఏపీ సర్కార్ భావిస్తుందని సమాచారం. ఈ విషయమై ఇవాళ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.