విదేశాలకు పారిపోతోంది ఎవరు: విజయసాయిరెడ్డిపై రఘురామ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 27, 2021, 02:58 PM IST
విదేశాలకు పారిపోతోంది ఎవరు: విజయసాయిరెడ్డిపై రఘురామ వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు ఆ పార్టీ రెబల్ రఘురామకృష్ణంరాజు. తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు . తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయి చెప్పారని.. విశాఖ తీర ప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. 

తానేదో విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారని... ఇప్పుడెవరు వెళ్తున్నారు? వారి మనసులో ఉన్న విషయాలను అందరిపై ఆపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. కోర్టు తీర్పు రాకముందే కొన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారని రఘురామ ప్రశ్నించారు. ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తా అని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu