నాకు మద్ధతివ్వండి: లోక్‌సభ ఎంపీలకు రఘురామ లేఖ, ఆశ్చర్యానికి గురైన సభ్యులు

Siva Kodati |  
Published : Jun 03, 2021, 06:26 PM IST
నాకు మద్ధతివ్వండి: లోక్‌సభ ఎంపీలకు రఘురామ లేఖ, ఆశ్చర్యానికి గురైన సభ్యులు

సారాంశం

సహచర ఎంపీలకు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇందులో తన అరెస్ట్ అనంతర పరిణామాలను ఆయన వివరించారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని రఘురామ కోరారు. 

సహచర ఎంపీలకు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇందులో తన అరెస్ట్ అనంతర పరిణామాలను ఆయన వివరించారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని రఘురామ కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆయన ఆరోపించారు. అయితే ఎంపీ రఘురామ లేఖను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు పలువురు ఎంపీలు.

జగన్‌ ప్రభుత్వానిది హిట్లర్‌ పాలనగా అభివర్ణించారు కాంగ్రెస్‌ ఎంపీ మానిక్కం ఠాగూర్‌ . అంతేకాకుండా రఘురామ లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు ఠాగూర్. రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అభిప్రాయప్డారు పలువురు ఎంపీలు. అయితే ఎంపీలకు రాసిన లేఖలపై స్పందించడానికి రఘురామ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌‌ బెయిల్‌ను రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశానని ఆయన గుర్తుచేశారు.

ALso Read:జగన్ బెయిల్ రద్దు కోరాననే....: ఓం బిర్లాకు రఘురామ కృష్ణం రాజు ఫిర్యాదు

ఆ కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి స్పీకర్‌ను కలిసిన రఘురామ దాదాపు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తనపై పెట్టిన రాజద్రోహం కేసు, తదనంతర పరిస్థితులన్నీ వివరిస్తూ స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. తన కేసులో సీఎం జగన్‌, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, ఏడిషినల్ ఎస్పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.
 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?