24 గంటల్లో 11,421 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 17,28,577కి చేరిక

Published : Jun 03, 2021, 04:59 PM ISTUpdated : Jun 03, 2021, 05:01 PM IST
24 గంటల్లో 11,421 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 17,28,577కి చేరిక

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 11,421కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 17లక్షల 28 వేల 577కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 81 మంది మరణించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 11,421కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 17లక్షల 28 వేల 577కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 81 మంది మరణించారు. గత 24 గంటల్లో  అనంతపురంలో 1041 చిత్తూరులో 1658, తూర్పుగోదావరిలో2308, గుంటూరులో669, కడపలో602, కృష్ణాలో841, కర్నూల్ లో556, నెల్లూరులో 546, ప్రకాశంలో 607,విశాఖపట్టణంలో 814, శ్రీకాకుళంలో 465, విజయనగరంలో318, పశ్చిమగోదావరిలో 996  కరోనా కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనా 81  మంది మరణించారు. చిత్తూరులో 13 మంది, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు. విజయనగరంలో ఏడుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ఆరురురు చొప్పున చనిపోయారు. కృష్ణా, కర్నూల్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు.  గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు. కడపలో ఇద్దరు మృతి చెందారు.ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 11,213 మంది చనిపోయారు. 

గత 24 గంటల్లో 86,223 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 11,421 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. గత 24 గంటల్లో కరోనా నుండి 16,223  మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 1,95,నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు195,34,279 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికి రాష్ట్రంలో 17,28,577మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,38,912 యాక్టివ్ కేసులున్నాయి. 

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,41,798 మరణాలు 937
చిత్తూరు-1,95,834 మరణాలు1338
తూర్పుగోదావరి-2,33,078, మరణాలు 989
గుంటూరు -1,52, 015,మరణాలు 966
కడప -96,481 మరణాలు 560
కృష్ణా -90,951 ,మరణాలు 990
కర్నూల్ - 1,16,531, మరణాలు 746
నెల్లూరు -1,19,832, మరణాలు 838
ప్రకాశం -1,09,382 మరణాలు 814
విశాఖపట్టణం -1,39,815 మరణాలు 957
విజయనగరం -75,126, మరణాలు 579
పశ్చిమగోదావరి-1,44136, మరణాలు 902

 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్