జగన్ కంపెనీలని టార్గెట్ చేసిన రఘురామ... ఏపీ హైకోర్టులో పిటిషన్

By Siva KodatiFirst Published Jun 22, 2021, 9:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే శాసనమండలిని రద్దు చేయాలంటూ ఆయన లేఖ రాశారు.  తాజాగా జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే శాసనమండలిని రద్దు చేయాలంటూ ఆయన లేఖ రాశారు.  తాజాగా జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్‌ వేశారు.

Also Read:మండలి రద్దుపై రఘురామ పావులు.. కేంద్రానికి లేఖ, జగన్ కోరికను నెరవేర్చాలంటూ వినతి

మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందని ఆయన పిటిషన్‌లో తెలిపారు. సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ఆ పిటీషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. సరస్వతి కంపెనీ, పరిశ్రమల శాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా రఘురామ కృష్ణరాజు చేర్చారు. 

ఏపీ మండలి రద్దుకు సహకరించాలని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు మంగళవారం కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషికి ఈ మేరకు లేఖలు రాశారు. మండలి రద్దు చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, గతంలో కూడా ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలి రద్దుకు సంబంధించి సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ నిన్న ఆయనకు రఘురామ లేఖ రాశారు.

మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తుందని పేర్కొన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు. 

click me!