అక్రమాస్తుల కేసు: వ్యక్తిగత హాజరుపై జగన్ పిటిషన్... విచారణ వచ్చే నెల 2కి వాయిదా

By Siva KodatiFirst Published Jun 22, 2021, 7:08 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అరబిందో, హెటిరో భుకేటాయింపులపై మంగళవారం సీబీఐ-ఈడీ కోర్టు విచారణ చేపట్టింది. తన బదులు తన న్యాయవాది విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అరబిందో, హెటిరో భుకేటాయింపులపై మంగళవారం సీబీఐ-ఈడీ కోర్టు విచారణ చేపట్టింది. తన బదులు తన న్యాయవాది విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు. ఈడీ కేసులను ముందుగా విచారణ జరపాలన్న సీబీఐ-ఈడీ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని వైసీపీ ఎంపీ కోర్టుకు వివరించారు.

Also Read:జగన్ అక్రమాస్తుల కేసు: బీపీ ఆచార్య పిటిషన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అయితే హైకోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నారని, దాంతో పిటిషన్లు ఇంతవరకు విచారణకు రాలేదని సీబీఐ-ఈడీ కోర్టుకు విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో, ఈడీ కేసుల విచారణకు సంబంధించిన అభియోగాల నమోదును వాయిదా వేయాలని ఆయన న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. దాంతో, కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది. అలాగే ఈ కేసులో జగన్ తరఫు వాదనలు కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది.

click me!