ఏం చేసినా చెల్లదు.. చంద్రబాబు కేసులో హైకోర్టు తీర్పు శుభపరిణామం: రఘురామ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 19, 2021, 7:26 PM IST
Highlights

రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి కేసులో హైకోర్టు స్టే ఇవ్వడంపై స్పందించారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి కేసులో హైకోర్టు స్టే ఇవ్వడంపై స్పందించారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇది శుభపరిణామమంటూ ఆయన స్వాగతించారు. ఏం చేసినా చెల్లుతుందన్న తమ పార్టీ అభిప్రాయాన్ని ఇకనైనా మార్చుకోవాలని రఘురామ హితవు పలికారు. 

నిన్న కూడా మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో జగన్‌ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రైతులను ఒప్పించి రాజధానికి భూములు తీసుకుందని ఎంపీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమైనా ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారా? అని రఘురామ ప్రశ్నించారు. 75కి 74 మున్సిపల్ చైర్మన్లు వచ్చినా ఆనందం లేదా అంటూ రఘురామ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:బాబుకు ఊరట: అమరావతి భూముల కేసులో సీఐడీ విచారణపై హైకోర్టు స్టే

కాగా, చంద్రబాబు, మాజీమంత్రి నారాయణల సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సీఐడీ కేసు విచారణపై న్యాయస్థానం 4 వారాలు స్టే విధించింది. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయస్థానం కోరింది.

ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని, పూర్తి స్థాయి విచారణకు అనుమతించాలని హైకోర్టును సీఐడీ అధికారులు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు..  ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో చంద్రబాబు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా? అని నిలదీసింది.
 

click me!