అతి విశ్వాసం వద్దు: తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలపై జగన్ సమీక్ష

By narsimha lodeFirst Published Mar 19, 2021, 5:35 PM IST
Highlights

తిరుపతి ఎంపీ స్థానంలో భారీ మెజారిటీతో విజయం సాధించాలని సీఎం జగన్ పార్టీ నేతలకు చెప్పారు.
 


అమరావతి:తిరుపతి ఎంపీ స్థానంలో భారీ మెజారిటీతో విజయం సాధించాలని సీఎం జగన్ పార్టీ నేతలకు చెప్పారు.

శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయంలో తిరుపతి ఎంపీ స్థానం పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు.ఏప్రిల్ 17వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగననున్నాయి. ఈ ఎన్నికల్లో  పార్టీ అభ్యర్ధి భారీ మెజారిటీతో విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేయాలని ఆయన నేతలకు సూచించారు.

స్థానిక సంస్థల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా అతి విశ్వాసానికి పోవద్దని సీఎం పార్టీ నేతలకు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.ఈ సమావేశంలలో తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్న డాక్టర్ గురుమూర్తిని సీఎం పార్టీ నేతలకు పరిచయం చేశారు.

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్నాయి. ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని ఇంకా బీజేపీ ప్రకటించలేదు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు  అభ్యర్ధులను ప్రకటించాయి.

click me!