పౌరుషం ఉంటే ఈటల మాదిరిగా రాజీనామా చేయాలి: రఘురామపై భరత్ విమర్శలు

Published : Jun 15, 2021, 02:09 PM ISTUpdated : Jun 15, 2021, 02:10 PM IST
పౌరుషం ఉంటే ఈటల మాదిరిగా రాజీనామా చేయాలి: రఘురామపై భరత్ విమర్శలు

సారాంశం

:పౌరుషం ఉంటే  తెలంగాణలో ఈటల రాజేందర్ మాదిరిగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ఎంపీ  మార్గాని భరత్ రఘురామకృష్ణంరాజుకు సవాల్ విసిరారు.


అమరావతి:పౌరుషం ఉంటే  తెలంగాణలో ఈటల రాజేందర్ మాదిరిగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ఎంపీ  మార్గాని భరత్ రఘురామకృష్ణంరాజుకు సవాల్ విసిరారు.మంగళవారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసి పోటీ చేస్తే  రఘురామకృష్ణంరాజుకు డిపాజిట్ కూడ దక్కదన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు తథ్యమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆర్టికల్ 10 ప్రకారంగా స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకొంటారని ఆయన చెప్పారు. స్పీకర్ ను కలిసినంతమాత్రాన రఘురామకృష్ణంరాజు భర్తరఫ్ ఆగదని ఆయన తెలిపారు.రఘురామ కృష్ణంరాజు అనర్హతపై లోక్‌సభ స్పీకర్‌కు రిమైండర్  నోటీస్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. 

also read:హామీలు నెరవేర్చండి.. ఉద్యోగ భర్తీపై రఘురామ గురి, జగన్‌కు వరుసగా నాలుగో లేఖ

గత వారంలో లోక్‌సభ స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరింది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్న సమయంలో మార్గాని భరత్  స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున  రఘురామకృష్ణంరాజుపై చర్యలను కోరుతూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu