బ్రహ్మంగారి మఠం వివాదం: కేసు నమోదు

By narsimha lodeFirst Published Jun 15, 2021, 1:44 PM IST
Highlights

బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి విషయంలో  రోజు రోజుకి వివాదం తీవ్రమౌతోంది. వీరబోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రి, రెండో భార్య కొడుకు పీఠాధిపతి విషయంలో పోటీ పడుతున్నారు.

కడప: బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి విషయంలో  రోజు రోజుకి వివాదం తీవ్రమౌతోంది. వీరబోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రి, రెండో భార్య కొడుకు పీఠాధిపతి విషయంలో పోటీ పడుతున్నారు.వీరభోగ వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ తన వద్ద ఉన్న వీలునామా ప్రకారంగా  తన కొడుకుకు పీఠాధిపతి పదవిని ఇవ్వాలని కోరుతున్నారు. అయితే  రెండు రోజుల క్రితం కందిమల్లాయపల్లెలో విశ్వబ్రహ్మన కార్పోరేషన్ చైర్మెన్ శ్రీకాంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా కొందరు ఆయనపై దాడికి దిగారు.  ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

also read:బ్రహ్మంగారి మఠం వద్ద హై టెన్షన్.. శ్రీకాంత్ ఆచారిపై దాడి.. పోలీసుల మోహరింపు..

బంకు శ్రీను, దీప్తి రమణారెడ్డి, బాబ్జీ, శ్రీరాములు, నారాయణరెడ్డి అనే వ్యక్తులపై 452,342,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రహ్మంగారి మఠలంలో విశ్వబ్రహ్మణుల మీడియా సమావేశాన్ని గ్రామస్తులు అడ్డుకొన్నారు. శివస్వామిపై విమర్శలు చేస్తే తాము సహించబోమని కందిమల్లాయపల్లె గ్రామస్తులు చెప్పారు. ఇదే డిమాండ్ తో  శ్రీకాంత్ మీడియా సమావేశాన్ని అడ్డుకొన్నారు.దేవాదాయశాఖ చట్టం ప్రకారంగా ఈ పీఠాధిపతి ఎంపిక విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ విషయమై సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి పీఠాధిపతులు, మఠాధిపతులను కోరారు. 


 

click me!