రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కరోనా

By narsimha lodeFirst Published Jul 2, 2020, 10:49 AM IST
Highlights

అనంతపురం జిల్లా రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన హొం క్వారంటైన్ లో ఉన్నారు.


అనంతపురం: అనంతపురం జిల్లా రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన హొం క్వారంటైన్ లో ఉన్నారు.

2019 ఎన్నికల్లో రాఫ్తాడు అసెంబ్లీ స్థానం నుండి మంత్రి పరిటాల సునీతపై తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీ రాష్ట్రంలో బుధవారం నాటికి కరోనా కేసులు 15,252కి చేరుకొన్నాయి. 

also read:ఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు: మొత్తం 193 మంది మృతి

అత్యధికంగా కర్నూల్ జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 9 లక్షల 18 వేల 429 మంది శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటి వరకు 8071 మంది కరోనా రోగులు వివిద ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అనంతపురం జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 118 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే గన్ మెన్లకు కరోనా సోకిన విషయం తెలిసింది.గన్ మెన్లతో పాటు ఆ ఎమ్మెల్యే కూడ కరోనా పరీక్షలు నిర్వహించుకొన్నాడు. కానీ అతనికి మాత్రం కరోనా నిర్ధారణ కాలేదు.

 

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ pic.twitter.com/ROeQbNCOvY

— Asianet News Telugu (@asianet_telugu)
click me!