అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై జిజిహెచ్ సూపరిండెంట్ ఏమన్నారంటే: సోమిరెడ్డి

By Arun Kumar PFirst Published Jul 1, 2020, 9:48 PM IST
Highlights

మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి బలవంతపు డిశ్చార్జిని ఖండిస్తున్నట్లు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

గుంటూరు: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి బలవంతపు డిశ్చార్జిని ఖండిస్తున్నట్లు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. రెండురోజుల క్రితమే అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి గురించి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తమకు తెలియజేశారన్నారు. ఆయన వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సూపరింటెండెంట్ తమకు తెలిపారని... ఇలాంటి పరిస్థితుల్లో చికిత్సను నిలిపివేసి ఎలా డిశ్చార్జి చేసి జైలుకు పంపిస్తారని ప్రభుత్వాన్ని సోమిరెడ్డి ప్రశ్నించారు. 

''అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు 29వ తేదీ ఉదయం గుంటూరు జీజీహెచ్ కి వెళ్లాం. ఈ సందర్భంగా  హాస్పిటల్ సూపరింటెండెంట్ ను కలిసి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాం.ఆయనకు గ్యాస్ట్రో ప్రాబ్లమ్ ఉందని, షుగర్ లెవల్స్ పడిపోయానని, ఆహారం తీసుకోవడం లేదని, కొలనోస్కోపీ చేయాలని సూపరింటెండెంట్ మాకు తెలిపారు'' అని వెల్లడించారు. 

read more రేపు అచ్చెన్నాయుడికి బెయిల్... అందుకే జైలుకు తరలింపు: రామ్మోహన్ నాయుడు

'' ఈ క్రమంలో అచ్చెన్న ఆరోగ్యంపై సదరు సూపరింటెండెంట్ సానుభూతి కూడా చూపారు. ఇన్ని చెప్పి రెండు రోజులు కాకముందే బలవంతంగా డిశ్చార్జి చేసి జైలుకు తరలించడం దుర్మార్గం. అచ్చెన్నాయుడిని ఒక్క రోజైనా జైలులో పెట్టాలని ప్రభుత్వం పంతం పట్టినట్టుంది'' అని అన్నారు. 

''ప్రస్తుతం ఇంకా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నను జైలుకు తరలించిన ప్రభుత్వమే ఆయన ఆరోగ్యం క్షీణిస్తే కూడా బాధ్యత వహించాలి. కక్షసాధింపులకు కూడా ఒక హద్దు ఉంటుంది.'' అని సోమిరెడ్డి అన్నారు.  

click me!