బుజ్జగింపు: సీఎం జగన్‌తో రోజా భేటీ

By narsimha lodeFirst Published Jun 11, 2019, 4:56 PM IST
Highlights

పీ సీఎం వైఎస్ జగన్ తో  నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. మంత్రి పదవి దక్కకపోవడంతో  అసంతృప్తిగా ఉన్న రోజాను జగన్ పిలిపించారని చెబుతున్నారు.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. మంత్రి పదవి దక్కకపోవడంతో  అసంతృప్తిగా ఉన్న రోజాను జగన్ పిలిపించారని చెబుతున్నారు. కానీ, తనను ఎవరూ పిలవలేదని రోజా స్పష్టం చేశారు.మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రోజాను బుజ్జగించేందుకు పిలిపించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

నగరి నుండి రెండు సార్లు వరుసగా విజయం సాధించిన రోజాకు జగన్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో చోటు కల్పించలేకపోయినట్టుగా జగన్ రోజాకు వివరించినట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో  రోజా అసంతృప్తిగా ఉన్నారు. జగన్ ఆహ్వానం మేరకు ఇవాళ అమరావతికి వచ్చినట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే అమరావతికి వచ్చినట్టుగా రోజా ప్రకటించారు. తనను ఎవరూ ఆహ్వానించలేదని ఆమె స్పష్టం చేశారు.

మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న రోజా జగన్ తో భేటీ అయ్యారు. అయితే రోజాకు కీలకమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవిని రోజాకు ఇస్తారని చెబుతున్నారు.

మరో వైపు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి పదవిని కేటాయించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మంగళవారం నాడు జగన్‌ను కలిసిన ఉదయభానుకు ఈ విషయమై ఆయన  హామీ ఇచ్చారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

నన్నెవరూ పిలవలేదు, నేనే వచ్చా: రోజా ట్విస్ట్

అసంతృప్తి: రోజా, ఆర్కేలకు ఫోన్లు, జగన్‌తో భేటీకి పిలుపు

click me!