వైఎస్ జగన్ ని కలిసిన సీఎం కుమారుడు

Published : Jun 11, 2019, 04:15 PM IST
వైఎస్ జగన్ ని కలిసిన  సీఎం కుమారుడు

సారాంశం

తాను జగన్ ని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన చెప్పడం గమనార్హం.  

ఏపీ నూతన ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ని  కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని  జగన్ నివాసానికి వచ్చిన నిఖిల్ గౌడను సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పేందుకు నిఖిల్ గౌడ వచ్చారు.

ఈ సందర్భంగా నిఖిల్ గౌడ, జగన్ కాసేపు ముచ్చటించారు. పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. కాగా... తాను జగన్ ని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన చెప్పడం గమనార్హం.

లోక్‌ సభ ఎన్నికల్లో కర్ణాకటలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నిఖిల్‌ ఘోరంగా ఓటమి పాలయ్యారు.  మండ్యలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్‌ నిఖిల్‌పై గెలుపొందారు. 

PREV
click me!

Recommended Stories

బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu
Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?