కుప్పంలో తుప్పును, పప్పును జనం తరిమి కొడతారు : చంద్రబాబు, లోకేశ్‌లపై రోజా తీవ్ర విమర్శలు

By Siva KodatiFirst Published Nov 13, 2021, 6:10 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లపై (nara lokesh) నగరి (nagari mla) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (rk roja)  తీవ్ర విమర్శలు చేశారు. కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారని ఆమె జోస్యం చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లపై (nara lokesh) నగరి (nagari mla) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (rk roja)  తీవ్ర విమర్శలు చేశారు. లోకేశ్ కామెంట్స్ చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే విధంగా ఉన్నాయని  ఆమె ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తుంగలో తొక్కారని, మున్సిపల్ ఎన్నికల్లో మురుగు కాల్వలో ముంచి తీశారని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తరిమి కొట్టారని రోజా వ్యాఖ్యానించారు. అయినా వారికి బుద్ధి రాలేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో లోకేశ్ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని రోజా దుయ్యబట్టారు. కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారని ఆమె జోస్యం చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravathi land case) అసైన్డ్ భూముల వ్యవహారంలో.. టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) , మాజీ మంత్రి నారాయణలకు (narayana) కాస్త ఊరట లభించింది. చంద్రబాబు, నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు.. విచారణకు సంబంధించి తదుపరి చర్యలను నిలిపివేస్తూ.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు (ap high court) మరో 8 వారాలు పొడిగించింది. 

ALso Read:ఏపీ స్థానిక ఎన్నికలు: ముగిసిన ప్రచారం.. రేపటి నుంచి ఎలక్షన్స్, కుప్పంపైనే అందరి దృష్టి

తదుపరి విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే (mangalagiri mla) ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla rama krishna reddy)  ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఇరువురూ హైకోర్టును ఆశ్రయించారు. వారి వ్యాజ్యాలపై న్యాయస్థానం మార్చి 19న విచారణ జరిపి.. సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగించాలని కోరారు. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సదరు ఉత్తర్వులను మరో ఎనిమిది వారాలకు పొడిగించారు. 

click me!