ఏపీ: 24 గంటల్లో 156 మందికి పాజిటివ్.. 20,66,875కి చేరిన సంఖ్య, తూర్పుగోదావరిలో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 13, 2021, 05:49 PM IST
ఏపీ: 24 గంటల్లో 156 మందికి పాజిటివ్.. 20,66,875కి చేరిన సంఖ్య, తూర్పుగోదావరిలో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 254 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,128 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 156 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,66,875కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,412కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 254 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,49,335కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 32,987 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,99,50,579కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,128 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 5, చిత్తూరు 34, తూర్పుగోదావరి 12, గుంటూరు 24, కడప 1, కృష్ణ 19, కర్నూలు 4, నెల్లూరు 13, ప్రకాశం 6, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 11, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 20 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Nadendla Manohar Pressmeet: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై మంత్రి కీలక ప్రకటన | Asianet News Telugu
No Shortage of LPG Cylinders: గ్యాస్ బుకింగ్‌లో కొత్త రూల్స్ | Asianet News Telugu