అక్కడకు వచ్చి ఉంటే సోమిరెడ్డిని తొక్కి నలిపేసేవారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

Published : Jan 10, 2019, 10:45 AM IST
అక్కడకు వచ్చి ఉంటే సోమిరెడ్డిని తొక్కి నలిపేసేవారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

సారాంశం

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఫైర్ అయ్యారు. ఇచ్ఛాపురం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు జనమే లేరన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇచ్ఛాపురంలో ముగింపు సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని కనిపించలేదా అని నిలదీశారు.   

తిరుమల : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఫైర్ అయ్యారు. ఇచ్ఛాపురం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు జనమే లేరన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇచ్ఛాపురంలో ముగింపు సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని కనిపించలేదా అని నిలదీశారు. 

అంతమంది జనం వస్తే అక్కడ జనమే లేరని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనడం చోద్యంగా ఉందన్నారు. సోమిరెడ్డి గనుక ముగింపు సభకు వచ్చి ఉంటే జనాలు తొక్కి నలిపేసేవారని రోజా ఘటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, చంద్రబాబు పాలనను ఎండగట్టడానికి మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప పాదయాత్ర సాగిందని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్ఐఏ చేతికి జగన్ కేసు.. టీడీపీ నేతలు జైలుకి రెడీగా ఉండండి: రోజా

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్