ఓడిన తర్వాత ఉన్నది కూడా పోయినట్లుందే: పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

Published : Aug 01, 2019, 09:59 AM ISTUpdated : Aug 01, 2019, 10:07 AM IST
ఓడిన తర్వాత  ఉన్నది కూడా పోయినట్లుందే: పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

సారాంశం

ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదని విమర్శించారు. రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా పవన్ గెలవలేకపోయాడని, పోటీ చేసిన140 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.   

అనంతపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదని విమర్శించారు. 

రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా పవన్ గెలవలేకపోయాడని, పోటీ చేసిన140 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

జనసేన తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గెలిచారని ఆయనకు కూడా పార్టీలో మర్యాద ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం అవుతుందని అనుకుంటే ఉన్నది కూడా పోయినట్లుందంటూ సెటైర్లు వేశారు.  

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్