జగన్ వస్తే వర్షాలు కాదు, ఉన్న నీరు ఇంకిపోతుంది: భూమా అఖిలప్రియ ఘాటు విమర్శలు

By Nagaraju penumalaFirst Published Aug 1, 2019, 7:47 AM IST
Highlights

వైయస్ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ తిట్టిపోశారు. పట్టిసీమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్పిన వైసీపీ ఇప్పుడే అదే నీరును ఎలా విడుదల చేస్తారో చెప్పాలంటూ విరుచుకుపడ్డారు. 
 
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి భూమా అఖిలప్రియ. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే వర్షాలు కురుస్తాయని వైసీపీ ప్రచారం చేసింది ఎక్కడైనా కురుస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. మబ్బులు పోయాయా అంటూ విమర్శించారు. 

జగన్ వస్తే వర్షాలు కురుస్తాయో లేదో తెలియదు కానీ ఉన్న నీరు ఇంకిపోతుందంటూ సెటైర్లు వేశారు. ఒకప్పుడు రైతులకు మాత్రమే నీరు ఉండేది కాదని నేడు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం కష్టమైందంటూ ధ్వజమెత్తారు. 

వైయస్ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ తిట్టిపోశారు. పట్టిసీమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్పిన వైసీపీ ఇప్పుడే అదే నీరును ఎలా విడుదల చేస్తారో చెప్పాలంటూ విరుచుకుపడ్డారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి రాజ్యమేలుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కో పనికి ఒక్కో రేటు చెప్తున్నారని విమర్శించారు. ఇక గ్రామవాలంటీర్ల దగ్గర నుంచి ఇల్లు, బోరు వరకు ప్రతీ దానికి ఒకరేటు నిర్ధారించి ఎమ్మెల్యేలు బోర్డులు పెట్టుకుని మరీ వసూలు చేస్తున్నారంటూ మాజీమంత్రి భూమా అఖిల ప్రియ విమర్శించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వారు ఉద్యోగస్తులు కాదు 50ఇళ్ల పనోళ్లు: గ్రామ వాలంటీర్లపై భూమా అఖిలప్రియ ఫైర్

click me!