మంచమే పట్టదు.. కొత్త జంటలకు కాపురం కూడా కష్టమే: జగనన్న ఇళ్లపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 26, 2021, 03:28 PM IST
మంచమే పట్టదు.. కొత్త జంటలకు కాపురం కూడా కష్టమే: జగనన్న ఇళ్లపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

జగనన్న ఇళ్లపై వైసీపీకే చెందిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లలో మంచం వేసుకునేంత చోటు కూడా లేదని వ్యాఖ్యానించారు. ఆ ఇంట్లో కొత్త జంటలు కాపురమే చేసుకోలేరని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. 

కాగా, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ల పేరిట పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. మూడు విభాగాలుగా గృహ నిర్మాణ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఆయా ఐచ్ఛికాల ఎంపికను లబ్ధిదారులకే వదిలేసింది.

Also Read:జగన్ కి రఘురామ మరో లేఖ.. 146 జీవో పై ఆగ్రహం..!

తొలిదశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీలు’ పేరిట ప్రభుత్వం నిర్మిస్తుంది. సొంతగా కట్టుకునే ఇళ్లు కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సొంత స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి కొనుగోలు, కూలీల ఖర్చు కింద ప్రభుత్వం తన వాటా భరిస్తుంది. ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును ఏర్పాటు చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్