ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గ్రూప్-1 ఇంటర్వ్యూలు రద్దు..!

By telugu news teamFirst Published Jun 26, 2021, 1:48 PM IST
Highlights

 ఉద్యోగ నియామకాల్లో ఇక‌పై రాత పరీక్షల్లో ప్ర‌తిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే.. కనీసం ఇంటర్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 సహా అన్ని పరీక్షల ఇంటర్వ్యూలను రద్దు చేరస్తూ... ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సి ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఈ రోజు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగ నియామకాల్లో ఇక‌పై రాత పరీక్షల్లో ప్ర‌తిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే.. కనీసం ఇంటర్యూలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు విడుదల చేయలేదు.

అయితే... ఏపీపీఎస్సీ నిర్వ‌హిస్తోన్న ఉద్యోగ నియామకాల రాత‌ప‌రీక్ష‌ల స‌మ‌యంలో విద్యార్థుల్లో ఒత్తిడిని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్‌-1 స‌హా అన్ని కేట‌గిరీ పోస్టుల‌కూ ఇంట‌ర్వ్యూల నుంచి మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది.
 

click me!