బ్రహ్మంగారి మఠం వివాదంలో ట్విస్ట్: మైదుకూరు ఎమ్మెల్యేపై పీఠాధిపతి రెండో భార్య వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 26, 2021, 3:03 PM IST
Highlights

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి శనివారం మీడియాతో మాట్లాడుతూ..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో తనతో ఇంతవరకు చర్చించలేదన్నారు

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి శనివారం మీడియాతో మాట్లాడుతూ..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో తనతో ఇంతవరకు చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని, సాయంత్రం తనతో చర్చిస్తామని మాత్రమే ఎమ్మెల్యే చెప్పారని మహాలక్ష్మీ వెల్లడించారు. దీనికిమించి ఎలాంటి ఏకాభిప్రాయానికి రాలేదని ఆమె పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు తాను పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి మద్దతు పలకలేదని ఆమె స్పష్టం చేశారు. వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహాలక్ష్మీ అన్నారు. తనకు న్యాయం జరిగితే మాత్రమే ఏకాభిప్రాయానికి వస్తానని ఆమె స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయశాఖతో చర్చించిన అనంతరం ప్రకటిస్తానని పేర్కొన్నారు. 

Also Read:వెంకటాద్రికే పగ్గాలు: బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపికపై సయోధ్య

కడప బ్రహ్మంగారి పీఠం మఠాధిపతి ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల శుక్రవారం నాడు సయోధ్య కుదిరింది. బ్రహ్మంగారి పీఠాధిపతి వీరభోగవెంకటేశ్వరస్వామి మరణంతో పీఠాధిపతి ఎంపికపై వివాదం మొదలైంది. వీరభోగ వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య మహాలక్ష్మమ్మను ఆయన వివాహం చేసుకొన్నాడు. వీరబోగ వెంకటేశ్వరస్వామి మొదటి భార్య కొడుకు వెంకటాద్రికి పీఠాధిపతి పదవిని ఇవ్వాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. వెంకటాద్రి సోదరుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా నియమించారు. మహాలక్ష్మమ్మ కొడుకులను భవిష్యత్తు వారసులుగా నియమించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

click me!