
టీడీపీ అధినేత (tdp) , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి (chandrababu naidu) నెల్లూరు జిల్లాకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (nallapareddy prasanna kumar reddy) అభినందనలు తెలపడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే ఇదే వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి (dy cm narayana swamy) మాత్రం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకే వేదికపై అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే పరస్పరం విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ఉపఎన్నిక (atmakur bypoll) నేపథ్యంలో ఆదివారం సంగం మండలం జంగాలకండ్రిక గ్రామంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డితో (mekapati vikram reddy) కలసి మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే పదవీకాలం మధ్యలో మరణించి ఉప ఎన్నికల్లో ఆ కుటుంబసభ్యులు పోటీ చేస్తే, అక్కడ పోటీ పెట్టకూడదని తెలుగుదేశం ఒక నియమం పెట్టుకుని అమలు చేస్తోందని ప్రశంసించారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అభినందిస్తున్నట్లు ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించినప్పుడు బీజేపీ నాయకులు సానుభూతి తెలిపి, ప్రస్తుతం పోటీ చేయడం దారుణమంటూ ఆయన ఫైరయ్యారు.
అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి గురించి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పిన విషయంతో తాను ఏకీభవించడం లేదన్నారు. టీడీపీ ఉప ఎన్నికలో పోటీ చేయకపోయినా.. ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా రకరకాల కుట్రలకు పాల్పడుతోందని నారాయణ స్వామి ఆరోపించారు. బాబు పెద్ద వెన్నుపోటు దారుడని వ్యాఖ్యానించారు. పేదలను బాగు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (ys jagan) అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. సంగం మండలంలో 2019లో రెండువేల ఆధిక్యం మాత్రమే వైసీపీకి లభించిందని, ప్రస్తుతం 20 వేలకు పెంచేందుకు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారని నారాయణ స్వామి తెలిపారు.