అన్ని దొంగ దీక్షలే.. జేసీయే మీ గుట్టు విప్పారు: టీడీపీపై మల్లాది విష్ణు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 22, 2020, 3:28 PM IST
Highlights

టీడీపీ దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు. పార్టీ ప్రయోజనాలు తప్ప తెలుగుదేశానికి ప్రజా ప్రయోజనాలు పట్టవని ఆయన వ్యాఖ్యానించారు

టీడీపీ దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు. పార్టీ ప్రయోజనాలు తప్ప తెలుగుదేశానికి ప్రజా ప్రయోజనాలు పట్టవని ఆయన వ్యాఖ్యానించారు.

విద్యుత్ బిల్లుల్లో టారిఫ్ పెంచినట్లు నిరూపించాలని మల్లాది సవాల్ విసిరారు. ఐదేళ్లపాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీయేదనని ఆయన విమర్శించారు.

Also Read:జగన్ గుడ్‌న్యూస్: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 3 మాసాల విద్యుత్ బిల్లులు మాఫీ

కరోనా కష్టకాలంలో పారిపోయి ఇప్పుడు ఇళ్లలో ఏసీ గదుల్లో కూర్చుని ధర్నాలు చేయటం సిగ్గుచేటని మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రప్రజలని గందరగోళానికి గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. పార్టీ మనుగడ కాపాడుకొనేందుకు నీచరాజకీయాలు చేస్తోందన్నారు.

రైతులకు తొమ్మిదిగంటల పగలు కరెంట్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగనే అని, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే టీడీపీ దొంగ దీక్షల గురించి చెప్పారని విష్ణు గుర్తుచేశారు. టీడీపీ నేతలు ఎల్లోమీడియా సహకారం తో దుష్ప్రచారం చేస్తున్నారని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వ్యక్తి చంద్రబాబేనని మల్లాది విష్ణు ఆరోపించారు.

Also Read:ఆ విపత్తు నుండి విశాఖ బయటపడింది...ఇప్పుడు రెండు రాష్ట్రాల వంతు: చంద్రబాబు

పీపీఏలలో రాష్ట్రాన్ని దోచుకున్నారని.. టీడీపీ నేతలు గ్లోబల్స్‌లా తయారయ్యారని ఆయన విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అసత్య ఆరోపణలకు బొండా ఉమా మాటలే నిదర్శనమని.. టీడీపీకి విద్యుత్ శాఖ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మల్లాది దుయ్యబట్టారు. 

click me!