డా సుధాకర్ పై దాడి: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్, సీబీఐ విచారణకు ఆదేశం

Published : May 22, 2020, 01:18 PM ISTUpdated : May 22, 2020, 01:51 PM IST
డా సుధాకర్ పై దాడి: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్, సీబీఐ విచారణకు ఆదేశం

సారాంశం

డాక్టర్ సుధాకర్ విషయమై సీబీఐ విచారణ చేయాలని ఏపీ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  ఎనిమిది వారాల్లో విచారణను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


అమరావతి: డాక్టర్ సుధాకర్ విషయమై సీబీఐ విచారణ చేయాలని ఏపీ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  ఎనిమిది వారాల్లో విచారణను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ విశాఖపట్టణం రోడ్లపై అర్ధనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. మద్యం మత్తులో ఆయన రోడ్డుపై  రభస సృష్టించాడని పోలీసులు ప్రకటించారు.

also read:డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం రేపటి లోపుగా నమోదు చేయాలి: ఏపీ హైకోర్టు ఆదేశం

ఈ ఘటనపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత హైకోర్టుకు లేఖ రాశారు.ఈ లేఖను పిటిషన్ గా హైకోర్టు స్వీకరించింది. డాక్టర్ సుధాకర్ పై పోలీసులు దాడి చేశారని ఆ లేఖలో అనిత చెప్పారు.

ఈ విషయమై విచారణ చేసిన హైకోర్టు విశాఖ జిల్లా సెషన్స్ జడ్జిని డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం తీసుకోవాలని ఇదివరకే ఆదేశించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ నుండి విశాఖ జిల్లా సెషన్స్ జడ్జి హైకోర్టుకు నివేదికను సమర్పించాడు..డాక్టర్ సుధాకర్  ఘటనపై శుక్రవారం నాడు విచారణ చేసిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

డాక్టర్ సుధాకర్ పై దాడికి పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సీబీఐని సమగ్ర దర్యాప్తు చేయాలని కోరింది. ప్రభుత్వం ఇచ్చే నివేదికపై నమ్మకం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కనీసం మాస్కులు కూడ రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని డాక్టర్ సుధాకర్  ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు సంబంధించిన వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేయడంతో మనోవేదనకు గురైనట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం ఆయన వాల్తేరు మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెెలిసిందే. 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu