నిమ్మగడ్డను కలిసి వైసీపీ నేతలు: టీడీపీపై ఫిర్యాదు.. అచ్చెన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్

By Siva KodatiFirst Published Feb 1, 2021, 4:38 PM IST
Highlights

ఏపీ ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ‌కలిశారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా టీడీపీపై ఫిర్యాదు చేశారు. నిన్న నిమ్మాడలో నామినేషన్ సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్ధితులు, దౌర్జన్యానికి సంబంధించి వైసీపీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఏపీ ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ‌కలిశారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా టీడీపీపై ఫిర్యాదు చేశారు. నిన్న నిమ్మాడలో నామినేషన్ సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్ధితులు, దౌర్జన్యానికి సంబంధించి వైసీపీ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది.

 ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని టీడీపీ నాశనం చేస్తోందని, చంద్రబాబు నీచ, దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.  చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై ఎస్ఈసీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.  

కేవలం ఒక నోటీసు ఇచ్చి వదిలేశారని.. ఎన్నికలు ముగిసే వరకు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. నిమ్మాడలో అచ్చెన్న దుర్భాషలాడారని ఆయన ఎద్దేవా చేశారు.

కాగా, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నిన్న అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది.  

Also Read:కత్తులు, రాడ్లతో వైసీపీ గుండాలు దాడి చేశారు: చంద్రబాబు

నిమ్మాడ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున  కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా పోటీకి బరిలోదిగాడు. అప్పన్న..అచ్చెన్నాయుడికి స్వయానా అన్న కుమారుడు. అప్పన్న నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. 

నిమ్మాడలో ఇప్పటి వరకు తనను పట్టించుకోలేదని అప్పన్న ఆవేదన వ్యక్తం చేశాడు.  సర్పంచ్‌ పదవేమన్నా రాష్ట్రపతి పదవా అంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశాడని అప్పన్న సన్నిహితులు అంటున్నారు.

అయితే వైసీపీ అభ్యర్థి కింజరాపు అప్పన్నతో టెక్కలి పార్టీ ఇన్‌ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌ రావడంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దువ్వాడతో సహా నామినేషన్‌ వేసే అభ్యర్థిని నామినేషన్‌ కేంద్రంలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. 

click me!