ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు లేఖ రాశాడు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు లేఖ రాశాడు.
ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నందున కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో నామినేటేడ్ పదవుల్లో ఉన్నవారికి సంబంధించి కీలక అంశాలను ఈ లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తావించారు.
ఎన్నికల పర్యటనల సమయంలో ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించకూడదని ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు వాడినా కూడ తమ హోదాను సూచించే నేమ్ ప్లేట్లు ఉండొద్దని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల టూరు విషయంలో కూడ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇద్దరు ఐఎఎస్ అధికారులను తన కార్యాలయానికి రావాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.