విభజనలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ ముద్దాయిలే... చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి : మోడీకి మల్లాది విష్ణు కౌంటర్

Siva Kodati |  
Published : Feb 08, 2022, 07:49 PM IST
విభజనలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ ముద్దాయిలే... చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి : మోడీకి మల్లాది విష్ణు కౌంటర్

సారాంశం

రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జరిగిన తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సమర్ధించకుంటే ఏపీ విభజన జరిగేదే కాదని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. 


రాష్ట్ర విభజనకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే మల్లాది విష్ణు (malladi vishnu). ఉమ్మడి రాష్ట్రం విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ముద్దాయిలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సరిగా విభజన చేయలేదని ప్రధాని అనడం తప్పించుకోవడానికి చేసిన కామెంట్లేనంటూ మల్లాది దుయ్యబట్టారు. జరిగిన తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సమర్ధించకుంటే ఏపీ విభజన జరిగేదే కాదని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. విభజన చట్టాన్ని అమలు చేయడం లేదని.. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు. 

ప్రత్యేక హోదా గురించి తిరుపతిలో ప్రధాని చేసిన వాగ్థానం గంగలో కలిసిందని.. సీఎం జగన్ పదే పదే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే వున్నారని మల్లాది గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమంటే .. ముగిసిన అధ్యాయమని బీజేపీ కామెంట్ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. విభజనకు సహకరించిన చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోవాలంటూ మల్లాది విష్ణు చురకలు వేశారు. నాటి బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ చేసిన కామెంట్ అర్ధమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు రాజ్యసభ వేదికగా వేరే పార్టీపైకి నెట్టేసే ప్రయత్నం చేయడం సరికాదని విష్ణు హితవు పలికారు. ఏపీకి న్యాయం చేస్తానన్న హామీలను .. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెడచెవిన పెట్టిందని విష్ణు ఆరోపించారు. ఏపీ ప్రజలకు మేలు జరిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. 

కాగా..  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు Rajya Sabhaలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పై విమర్శల దాడిని రెండో రోజూ కూడా ఆయన కొనసాగించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే రాష్ట్ర విభజన అంశంపై మోడీ స్పందించారు. 

Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే  ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు. 

Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి ఆయన గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొన్న కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు వచ్చాయన్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విభజన వ్యవహరం ఎలా జరిగిందనేది కీలకమన్నారు. Parliament లో మైకులు కట్ చేసి తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని ప్రధాని మోడీ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేస్తారా అని మోడీ ప్రశ్నించారు. మీ అహంకారంతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందన్నారు గతంలో తాము ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మమయంలో శాంతియుత వాతావరణం ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేసుకొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో  ఈ తరహ చర్యలు తీసుకోలేదన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu