రజనీకాంత్ మరింత దిగజారిపోయారు.. పవన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు చంద్రబాబు ప్లాన్: కొడాలి నాని

By Sumanth KanukulaFirst Published Apr 29, 2023, 2:30 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతుగా నిలిచారని ఆరోపించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అటువంటి రజనీకాంత్ ఈరోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడటం శోచనీయమని అన్నారు. వెధవలంతా చేరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఎన్టీఆర్ బతికున్నప్పుడు రజనీకాంత్ ఏం చేశారని ప్రశ్నించారు. రజనీకాంత్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవుతూ మరింత దిగజారిపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే రజనీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దింపారని ఆరోపించారు. చంద్రబాబు  కుట్ర రాజకీయాలను పవన్ కల్యాణ్ గ్రహించాలని అన్నారు. 

Latest Videos

Also Read: రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుంది.. ఆ వీడియోలను చూసినట్టు లేదు: మంత్రి రోజా

 

ఇదిలా ఉంటే.. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  రజనీకాంత్ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడి చాలా రోజులు అయిందని.. ఏదైనా తప్పైతే తనను క్షమించాలని కోరారు. సభలో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో అనుభవం చెబుతుందని అన్నారు. ఇక్కడ ఉన్న సభ, అభిమానం చూసినప్పుడు రాజకీయం మాట్లాడాలని అనిపిస్తుందని.. అయితే అనుభవం మాత్రం వద్దని అంటుందని చెప్పారు. తాను రాజకీయం మాట్లాడితే మీడియాలో ఏదేదో రాస్తారని అన్నారు. అయితే తన మిత్రుడు చంద్రబాబు గురించి కొద్దిగా రాజకీయం మాట్లాడతానని అన్నారు. 30 ఏళ్ల నుంచి చంద్రబాబు తన మిత్రుడని.. మోహన్ బాబు పరిచయం చేశారని.. పెద్ద నాయకుడు అవుతాడని చెప్పాడని  గుర్తుచేసుకున్నారు.  

హైదరాబాద్ వెళ్లిన సందర్భాల్లో చంద్రబాబును కలిసేవాడినని.. ఆయనతో మాట్లాడుతున్న సమయంలో తన జ్ఞానం పెరిగిందని చెప్పారు. జనాలకు మంచి చేయాలనేదే చంద్రబాబు విజన్ అని తెలిపారు. చంద్రబాబు ఒక విజనరీ అని అన్నారు. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు చంద్రబాబు ఘనత, ట్యాలెంట్ ఏమిటనేది తెలుసునని అన్నారు. ఇక్కడున్నవాళ్లకంటే.. బయటవాళ్లకు ఈ విషయం బాగా తెలుసునని కామెంట్ చేశారు.


‘‘1996-97లో విజన్ 2020 అని చంద్రబాబు చెప్పారు. ఐటీకి ఎలా ఫ్యూచర్ ఉందని తెలిపారు. అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆయన అప్పుడు చెప్పిందే హైదరాబాద్‌ను హైటెక్ సిటీగా మార్చింది. బిల్ గేట్స్ లాంటి వాళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు నేడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మొన్న హైదరాబాద్‌‌లో కొన్ని ప్రాంతాలను  చూస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అని అనిపిచింది. హైదరాబాద్ ఎకానమిక్‌‌గా ఎంతో ఎదుగుతోందో అందరికి తెలుసు. 

చంద్రబాబు ఎప్పుడగిడినా నాకు అపాయింట్‌మెంట్ ఇస్తారు. నా జన్మదినం రోజున  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇప్పుడు చంద్రబాబు  నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ ఏపీకి 2047కు ఏం చేయాలని ఇప్పుడే ప్లాన్ చేస్తారు. అదంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్‌ ఇండియాలో ఎక్కడికో వెళ్లిపోతుంది. దేవుడి దయ వల్ల అది జరగాలి.  ఎన్టీఆర్‌ ఆత్మ చంద్రబాబుకు తోడుగా  ఉండాలి’’ అని అన్నారు.

click me!