
గురజాల : అధికార వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ప్రతిపక్ష టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లలతో పల్నాడు రాజకీయాలు పాలిటిక్స్ హీటెక్కాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాటలయుద్దంతో గురజాల నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే కాసు పోలీసులను ఉపయోగించుకుని టిడిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, స్టేషన్లకు రమ్మంటూ వేధిస్తున్నారని యరపతినేని ఆరోపించారు. తాను పాత శ్రీనును అయివుంటే ఇప్పటికే టిడిని నాయకులను వేధిస్తున్న వారిని బట్టలూడదీసి నడిరోడ్డుపై కొట్టేవాడినని అన్నారు. తాను మారాను కాబట్టే వాళ్ళు బ్రతుకుతున్నారని హెచ్చరించారు. ఎమ్మెల్యే కాసు లాంటి వారు తన వెంట్రుకతో సమానమని... నేరుగా పులివెందుల పిల్లి వైఎస్ జగన్ తోనే తేల్చుకుంటానని యరపతినేని అన్నారు.
Read More సొంత పిన్నమ్మ తాళి తెంపింది జగన్ రెడ్డే..: వివేకా హత్యపై టిడిపి ఎమ్మెల్సీ సంచలనం
అయితే తాజాగా యరపతినేనికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒక్కడినే కట్టు బట్టలతో గురజాలకు వచ్చి నీ గుడ్డలు ఊడదీసి పంపించింది మరిచావా యరపతినేని అంటూ ఎద్దేవా చేసారు. ఆయన నియోజకవర్గంలో గెలిచే దమ్ములేదు కానీ 151 సీట్లు గెలిపించుకున్న జగన్ తో పోటీ పడతావా... ఇలాగే వాగితే గత ఎన్నికలో 28వేల ఓట్లతో ఓడించిన ప్రజలు ఈసారి 48వేలతో ఇంటికి పంపిస్తారని కాసు హెచ్చరించారు.
వీడియో
యరపతినేని శ్రీనివాసరావు మైక్ పులి... అన్నిట్లోనూ పిల్లి అని ఎమ్మెల్యే ఎద్దేవా చేసారు. గురజాల నియోజవర్గ అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం ఎవరేం చేసారో చర్చిద్దాం... బహిరంగ చర్చకు రమ్మని ఛాలెంజ్ విసిరితే తుస్సుమని వెళ్లి గుంటూరులో కూర్చున్నాడు... ఈయన పులివెందులకు పోటీ అంటున్నాడని ఎద్దేవా చేసారు. యరపతినేని తాగిన మైకంలో ఏది పడితే అది మాట్లాడుతుంటాడు... ఇలాంటి బచ్చాగాళ్లను చిన్ననాటి నుండి చూస్తున్నానని అన్నారు.
చేతనైతే నువ్వు ఎమ్మెల్యేగా వుండగా ఏం చేసావో... భవిష్యత్ లో ఏం చేస్తావో చెప్పు... అంతేగాని నేనొస్తే ఇరగదీస్తా, పొడుస్తా, తంతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని యరపతినేనికి కాసు సూచించారు. ఎవన్ని తంతావు... వైసిపి కార్యకర్తమీద చెయ్యేసి చూడు ఆడాళ్లతో తన్నిస్తా అంటూ హెచ్చరించారు. ఎవడైనా తమ జోలికి వస్తే తాట తీస్తామని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వేధించాల్సిన అవసరం తనకు లేదని... మీలాగా మేము కేవలం పోలీసులు వుంటేనే మగాళ్ళం అనుకునే రకం కాదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రతి ఇంటికి లబ్ది జరుగుతోందని... ఇటువంటి నాయకుడి కింద పనిచేయడం చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఇప్పటికే పిడుగురాళ్ళలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని... ఇది అందుబాటులోకి వస్తే ప్రజలకు ఉచితంగానే వైద్యం అందుతుందన్నారు. ఇలా ఎన్నో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేస్తుంటే టిడిపి నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. టిడిపి హయాంలో కనీసం కనీసం మరుగుదొడ్డి కూడా కట్టలేకపోయారు... వీళ్లా మన గురించి మాట్లాడేది...చేతకాని తెలుగుదేశం దద్దమ్మల మాటలు పట్టించుకోవద్దని ఎమ్మెల్యే కాసు పేర్కొన్నారు.